News January 6, 2025
మోహన్ బాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇవాళ వాదనలు కొనసాగాల్సి ఉండగా ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులోకి రాలేదు. దీంతో మరో న్యాయవాది పాస్ ఓవర్ కోరగా ధర్మాసనం అంగీకరించలేదు. గురువారానికి వాయిదా వేసింది. కాసేపటికి ముకుల్ రోహత్గీ వచ్చి విజ్ఞప్తి చేసినప్పటికీ న్యాయమూర్తులు అంగీకరించలేదు.
Similar News
News October 14, 2025
ESIC ఇండోర్లో 124 ఉద్యోగాలు

ESIC ఇండోర్ కాంట్రాక్ట్ పద్ధతిలో 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/MD/MSతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 21లోగా ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://esic.gov.in/recruitments
News October 14, 2025
మల్లోజుల వేణుగోపాల్ నేపథ్యమిదే!

<<18001632>>మల్లోజుల వేణుగోపాల్<<>> అలియాస్ సోనూ దివంగత మావోయిస్టు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ తమ్ముడు. ఇతని స్వస్థలం TGలోని పెద్దపల్లి. బీకాం చదివిన ఈయన గడ్చిరోలి, ఏపీ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2011 NOVలో బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ చనిపోగా, ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తార లొంగిపోయారు. 69ఏళ్ల వయసున్న వేణుగోపాల్ మునుపటిలా యాక్టివ్గా లేరని సమాచారం.
News October 14, 2025
కొనుగోళ్లలో పత్తి రైతుకు దక్కని మద్దతు

AP: కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్కు పొడవు పింజ రూ.8,110, పొట్టి పింజ రూ.7,710గా నిర్ణయించారు. అయితే సోమవారం 16 వేల క్వింటాళ్ల మేర పత్తి అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.7,419, కనిష్ఠంగా రూ.3,966కే కొన్నారు. మెజార్టీ పత్తిని క్వింటాకు రూ.5,500-రూ.5000 మధ్యే కొంటున్నారని రైతులు చెబుతున్నారు.