News December 11, 2024
హైకోర్టులో మోహన్‌బాబు లంచ్ మోషన్ పిటిషన్

TG: పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ నటుడు మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇది మధ్యాహ్నం 2.30గంటలకు విచారణకు రానుంది. మరోవైపు మంచు మనోజ్ కాసేపట్లో రాచకొండ సీపీ ఎదుట హాజరు కానున్నారు. జల్పల్లి వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 26, 2025
NGKL: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి: కలెక్టర్

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ సంతోష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ పాటించాలని, 5000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలలో రూ.2.5 లక్షలు సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు చేయాలని, వార్డు సభ్యులు రూ.50,000 ఖర్చు చేయాలనే సూచించారు.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


