News August 12, 2024
ఎన్టీఆర్ తర్వాత మోహన్‌బాబే బెస్ట్ యాక్టర్: భట్టి

నటనలో ఎన్టీఆర్ తర్వాత మోహన్‌బాబే బెస్ట్ యాక్టర్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. ఏపీలోని చంద్రగిరిలో జరిగిన ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకల్లో భట్టి మాట్లాడారు. ‘పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పేందుకు మోహన్‌బాబు జీవితమే నిదర్శనం. విద్యను వ్యాపారంగా కాకుండా సేవాభావంతో అందిస్తున్నారు. ఎన్ని విజయాలు సాధించినా ఆయన గతాన్ని మర్చిపోరు’ అని ఆయన కొనియాడారు.
Similar News
News January 1, 2026
2026లో IPOల జాతర.. లిస్ట్‌లో జియో, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే

2026లోనూ IPOల జాతర కొనసాగనుంది. ఈ ఏడాది పలు పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెెట్లో ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.11-12 లక్షల కోట్ల విలువైన పబ్లిక్ లిస్టింగ్‌కు రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది తొలి భాగంలోనే IPOకు రానుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సుమారు రూ.6 లక్షల కోట్ల వాల్యుయేషన్‌తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ పే, జెప్టో, ఓయోతోపాటు పదుల సంఖ్యలో కంపెనీలు లైన్లో ఉన్నాయి.
News January 1, 2026
మహిళలూ కొత్త సంవత్సరంలో ఇవి ముఖ్యం

తల్లి, భార్య, కూతురు, కోడలు పాత్రల్లో జీవిస్తున్న మహిళ తన గురించి తాను మర్చిపోయింది. ఈ కొత్త సంవత్సరంలోనైనా నీ కోసం నువ్వు బ్రతుకు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకో, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టు. కష్టపడి నిర్మించుకున్న కెరీర్, చెమట చిందించి సంపాదించిన ప్రతి రూపాయినీ కాపాడుకో.. ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తగా ఉండు.. ఆరోగ్యాన్ని సంరక్షించుకో.. కొత్తసంవత్సరాన్ని అద్భుతంగా మార్చుకో..
News January 1, 2026
క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి

దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఇండోర్(MP)లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం సంచలనంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేసే మంచినీటి పైప్ లైన్లో మురుగునీరు కలవడంతో ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. DEC 25నే కుళాయిల నుంచి దుర్వాసన వస్తోందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని భగీరథ్పుర వాసులు తెలిపారు. మృతుల్లో 6 నెలల శిశువు కూడా ఉంది. 2వేల మంది చికిత్స పొందుతున్నారు.


