News March 25, 2025
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్

మోహన్ లాల్ ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్‌ను తాను చూశానని, సినిమాలో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారన్నారు. అయితే లూసిఫర్-2తో గాడ్ ఫాదర్-2 తీయలేరని, ఇందులోని పాత్రలను తీసేయడం అసాధ్యమన్నారు. కాగా ‘L2:ఎంపురాన్’ ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.
Similar News
News March 26, 2025
కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్

జోర్డాన్ రాజధాని అమ్మన్‌లో జరుగుతోన్న సీనియర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్-2025లో భారత రెజ్లర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. 87 కేజీల విభాగంలో చైనా రెజ్లర్‌ను చిత్తు చేసి బ్రాంజ్ మెడల్ సాధించారు. దీంతో భారత్ పతకాల ఖాతా తెరిచింది. హరియాణాకు చెందిన సునీల్ గతంలో ఏషియన్ ఛాంపియన్ షిప్స్‌లో ఒక గోల్డ్ (2020), ఒక సిల్వర్ (2019), రెండు బ్రాంజ్ (2022, 2023) మెడల్స్ గెలిచారు.
News March 26, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 26, 2025
మార్చి 26: చరిత్రలో ఈరోజు

1872: కవి దివాకర్ల తిరుపతి శాస్త్రి జననం
1971 : పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్‌గా అవతరించింది
1965: నటుడు ప్రకాశ్ రాజ్ జననం (ఫొటోలో)
1972: నటి మధుబాల జననం (ఫొటోలో)
1990: సినీ గాయని బెంగళూరు లత మరణం
2006: సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు మరణం
2013: నటి సుకుమారి మరణం