News March 19, 2025

ఐమాక్స్ ఫార్మాట్‌లో.. మోహన్‌ లాల్ చిత్రం

image

మోహన్‌లాల్ హీరోగా ప్రుథ్వీ రాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని మార్చి 27న ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మలయాళంలో ఐమాక్స్ ఫార్మాట్‌లో వస్తున్న తొలి చిత్రంగా ‘ఎల్ 2 ఎంపురాన్’ రికార్డు సృష్టించింది. ‘ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయటం సంతోషంగా ఉందని’ ప్రుథ్యీరాజ్ Xలో పోస్ట్ చేశారు.

Similar News

News March 19, 2025

సంగారెడ్డి: భట్టి బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా..!

image

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు బోలేడు ఆశలు పెట్టుకున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. పటాన్‌చెరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో జాప్యం, పెండింగ్‌లో ఉన్న కొత్త రోడ్లు, విద్యా, వైద్య రంగాల్లో అనిశ్చితి తొలిగేలా చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.

News March 19, 2025

ఆ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పెంపు

image

AP: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్‌కు రూ.7వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్‌డీ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.

News March 19, 2025

10,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్స్

image

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 10,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్‌లోనే దాదాపు 18వేల మందికి లేఆఫ్స్ ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు మరోసారి ఉద్యోగాలకు కోత విధించనుంది. దీనిని పలువురు టెక్ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. AI టెక్నాలజీ రావడంతో పలు ఐటీ సంస్థలు భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!