News December 16, 2024

‘కన్నప్ప’ నుంచి మోహన్ లాల్ లుక్ రివీల్

image

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి మోహన్ లాల్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో ఆయన ‘కిరాత’గా కనిపించనున్నట్లు పేర్కొంది. ‘పాశుపతాస్త్ర ప్రధాత విజయుడిని గెలిచిన ఆటవిక కిరాత’ అంటూ ఆయన క్యారెక్టర్ గురించి రాసుకొచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితర స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 26, 2025

నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

image

నెల్లూరు రూరల్‌లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్‌తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

ఏడాదికి లక్ష మంది అగ్నివీర్‌ల నియామకానికి ప్లాన్!

image

రాబోయే 4 ఏళ్లలో ఏడాదికి లక్ష మంది అగ్నివీర్‌లను నియమించుకోవాలని ఆర్మీ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా 1.8 లక్షలుగా ఉన్న సైనిక కొరతను అధిగమించాలని భావిస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 2022 నుంచి ప్రతి ఏడాది 45వేల నుంచి 50వేల మంది అగ్నివీర్‌లను ఆర్మీ నియమిస్తోంది. కరోనా కారణంగా 2020, 21లో రిక్రూట్‌మెంట్లు నిలిపివేయడం, అప్పుడే ఏడాదికి 60వేల నుంచి 65వేల మంది రిటైర్ కావడంతో సైనికుల కొరత ఏర్పడింది.