News May 20, 2024

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బర్!

image

ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ముహమ్మద్ మొఖ్బర్ ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. దీనికి సుప్రీం లీడర్ ఆమోదం లభించాల్సి ఉంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఒక అధ్యక్షుడు మరణించిన 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ముహమ్మద్ మొఖ్బర్ 2021 ఆగస్టు 8 నుంచి ఆ దేశ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Similar News

News October 23, 2025

నేడు భగినీ హస్త భోజనం

image

5 రోజుల దీపావళి పండుగలో చివరిది భగినీ హస్త భోజనం. ‘భగిని’ అంటే సోదరి అని అర్థం. ఆమె చేతి భోజనం సోదరుడికి దైవ ప్రసాదంతో సమానం. పురాణాల ప్రకారం.. ఈ పండుగను యమునా దేవి తన సోదరుడు యముడితో కలిసి నిర్వహించింది. అందుకే నేడు అన్నాచెల్లెల్లు/అక్కాతమ్ముళ్లు కలిసి ఆప్యాయంగా కొద్ది సమయం గడుపుతారు. ఇది అకాల మరణం నుంచి తప్పిస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం వెనుక బంధాలను బలోపేతం చేసే కారణం కూడా ఉంది.

News October 23, 2025

అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే ఫ్యాక్ట్ చెక్

image

భారత రైల్వేకు సంబంధించి అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్ చెక్‌ను తీసుకొచ్చింది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు X హ్యాండిల్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. రైల్వేల గురించి తప్పుదారి పట్టించే లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే <>IRFactCheck<<>>ను ట్యాగ్ చేయాలని కోరింది. వాస్తవాలను ట్రాక్‌లో ఉంచేందుకు సహాయపడాలని కోరింది.

News October 23, 2025

ఆకుకూరల్లో చీడపీడల నివారణకు సూచనలు

image

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆకుకూరల పంటల్లో అనేక చీడపీడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన తెల్లని బొడిపెలు, పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండు బారుతున్నాయి. వీటి నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు ఆకులను కొరికి తింటుంటే లీటరు నీటికి కార్బరిల్ మందును రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.