News August 20, 2025
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో మోక్షజ్ఞ ఎంట్రీ: నారా రోహిత్

నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ అతి త్వరలో ఉంటుందని హీరో నారా రోహిత్ తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు అతడు ఆసక్తిగా ఉన్నాడన్నారు. ‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కోసం వెతుకుతున్నట్లు మోక్షజ్ఞ చెప్పాడు. అలాంటి కథ ఉంటే ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఉండొచ్చు. మూవీల కోసమే తన లుక్ మొత్తం మార్చేసుకున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అటు బాలయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని రోహిత్ చెప్పారు.
Similar News
News April 2, 2026
హార్ముజ్‌లో ఇండియన్స్ సేఫ్: ఇరాన్

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతపై ఇరాన్ భరోసా ఇచ్చింది. ‘మా ఇండియన్ ఫ్రెండ్స్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు’ అని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన 19 చమురు నౌకలతో పాటు వేలాది మంది భారత సిబ్బంది యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం జరిపిన దౌత్య చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని నౌకలు సేఫ్‌గా స్వదేశానికి చేరుకున్నాయి.
News April 2, 2026
బీజేపీతో జాగ్రత్త.. TDPకి ఆప్ ఎంపీ హెచ్చరిక

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీదని, ఆ పార్టీ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉందని, కేంద్రం నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకోవాలని సూచించారు.
News April 2, 2026
ఆప్ డిప్యూటీ నేతగా రాఘవ్ చద్దా తొలగింపు!

రాజ్యసభలో తమ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్(పంజాబ్)ను నియమించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వొద్దని కోరింది. పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల వరుసగా ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతూ చద్దా వార్తల్లో నిలిచారు.


