News December 1, 2024

ఈనెల 5న మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ స్టార్ట్!

image

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలతో మొదలు పెడతారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని వెల్లడించాయి. ఇప్పటికే ఈ సినిమాలో మోక్షజ్ఞ లుక్‌ను మేకర్స్ రివీల్ చేయగా ఆకట్టుకుంది.

Similar News

News December 31, 2025

ఇప్పుడు హీరోగా చేయాలనే ఆలోచన లేదు: అనిల్ రావిపూడి

image

సినిమా ప్రమోషన్లలో హీరోహీరోయిన్లకు తగ్గకుండా డైరెక్టర్ అనిల్ రావిపూడి యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఓ ఈవెంట్‌లో హీరోగా ఎంట్రీ ఎప్పుడిస్తారనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘మనం సక్సెస్‌ఫుల్‌గా ఉంటే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. పొరపాటున అటువైపు వెళ్తే మన పని అయిపోయినట్లే. హ్యాపీగా మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లాలి. ఇప్పట్లో హీరోగా చేసే ఆలోచన లేదు’ అని చెప్పారు.

News December 31, 2025

ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్.. ₹80,915 కోట్లు కోల్పోయాడు!

image

ఓ బిలియనీర్‌ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఏకంగా ₹80,915 కోట్ల నష్టం కలిగించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకించడమే ఇందుకు కారణం. టింకాఫ్ బ్యాంక్ ఫౌండర్ టింకోవ్ 2022లో రష్యాను విమర్శించడంతో క్రెమ్లిన్ తీవ్రంగా స్పందించింది. ఆయన వాటాను విక్రయించాలని, లేదంటే బ్యాంకును జాతీయం చేస్తామని హెచ్చరించింది. దీంతో టింకోవ్ తన 35%వాటాను అమ్మేశారు. కానీ వాస్తవ విలువలో 3% చెల్లించడంతో ₹80,915cr కోల్పోయారు.

News December 31, 2025

పెరుగుతున్న ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్

image

గతంలో పిల్లల పెంపకంలో పెద్దలు, వైద్యులు, పుస్తకాలపై ఆధారపడేవారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ పేరెంటింగ్ వైరల్ అవుతోంది. మనకున్న సందేహాలు, సలహాలను టైప్ చేస్తే ఎన్నో వీడియోలు వస్తున్నాయి. విస్తృతస్థాయి పేరెంటింగ్‌ విధానాలు, చిన్న కుటుంబాల వారు సలహాల కోసం దీనిపై ఆధారపడుతున్నారు. అయితే ప్రొఫెషనల్, పర్సనలైజ్‌డ్‌ మెడికల్, ఫ్యామిలీ గైడెన్స్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంటింగ్‌ సమానం కాదని నిపుణులు చెబుతున్నారు.