News December 2, 2024
అమ్మానాన్నా క్షమించండి.. సెల్ఫీ వీడియో తీసి యువతి ఆత్మహత్య

TG: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన అమ్మాయి కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రామగుండంలో జరిగింది. ‘అమ్మానాన్నా నన్ను క్షమించండి. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆయన వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’ అని సెల్ఫీ వీడియో తీసి ఉరేసుకుంది. నరేందర్, దీప్తి 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. కాగా తమ బిడ్డను నరేందరే చంపాడని పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.
Similar News
News November 23, 2025
ములుగు: నేడు సర్పంచ్ రిజర్వేషన్ జాబితా విడుదల..!

సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 10 మండలాల్లోని 146 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను అధికారులు నిర్ణయించారు. అనంతరం నివేదికను కలెక్టర్కు అందజేశారు. నేడు తుది జాబితాను కలెక్టర్ అధికారికంగా విడుదల చేయనున్నారు. అనంతరం ఇదే జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.


