News February 2, 2025

‘అమ్మానాన్నా.. నేను చనిపోతున్నా’

image

TG: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన యోగిత (15) చిన్నప్పటి నుంచి మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని అమ్మమ్మ వద్ద ఉంటోంది. టెన్త్ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తుండటంతో సూసైడ్ చేసుకుంది. ‘ఎంత చదివినా మార్కులు రావడం లేదు. 10 జీపీఏ సాధించాలనుకుంటున్నా నా వల్ల కావట్లేదు. నేను చనిపోతున్నా. అమ్మానాన్నా క్షమించండి’ అని సూసైడ్ నోట్ రాసింది.

Similar News

News November 28, 2025

హైదరాబాదీలు వీకెండ్ ప్లాన్ చేశారా?

image

నగరవాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీకెండ్ చిల్ అయ్యేందుకు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్‌ పార్క్‌లో TGFDC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈనెల 29న సా.5 నుంచి 30న ఉ.10 గంటల వరకు నేచర్ క్యాంప్‌ నిర్వహించనున్నారు. ఇందులో టెంట్‌ పిచింగ్, టీమ్‌ బిల్డింగ్, నైట్‌ క్యాంపింగ్ ఫారెస్ట్ వాక్ వంటివి ఉంటాయి. ఇందులో అరుదైన పక్షిజాతులను చూడొచ్చు. ఆసక్తిగలవారు 73823 07476, 94935 49399లో సంప్రదించండి.

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

image

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది