News August 7, 2025
‘అమ్మా.. ఇక సెలవు’

AP: వడ్డీ వ్యాపారుల దోపిడీకి ఓ నిండు ప్రాణం బలైంది. అనంతపురం(D) గుత్తి సెంట్రల్ బ్యాంకులో సబ్ స్టాఫ్‌గా పనిచేసే రవికుమార్ ఓ వడ్డీ వ్యాపారిని ₹50వేల లోన్ అడగగా ₹15K పట్టుకుని ₹35K ఇచ్చారు. దానికి వడ్డీనే ₹1.20 లక్షలు చెల్లించిన రవి ఇక తన వల్ల కాదని బ్యాంకు వాష్‌రూంలో ఉరేసుకున్నాడు. ‘నా టైం అయిపోయింది. అప్పులే నాకు శాపమయ్యాయి. అమ్మా.. ఇక సెలవు. హరితా (భార్య) నన్ను క్షమించు’ అని సూసైడ్ నోట్ రాశారు.
Similar News
News August 10, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుందని అంచనా వేశారు. మరోవైపు హైదరాబాద్‌లో మధ్యాహ్నం తేలికపాటి, రాత్రి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News August 10, 2025
ఇవాళ్టి నుంచి తిరంగా యాత్రలు: మాధవ్

AP: ఇవాళ్టి నుంచి 14 వరకు తిరంగా యాత్రలు నిర్వహించాలని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపటాలకు నివాళులు అర్పించాలని సూచించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు బీజేపీ శ్రేణులు తమ ఇళ్లపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయాలని, 15న బహిరంగ ప్రదేశాల్లో జెండా ఆవిష్కరణల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.
News August 10, 2025
కేటీఆర్ Vs కవిత.. రాఖీపే చర్చ!

TG: రాఖీ వేళ KTR, కవిత మధ్య దూరం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘అన్నా.. రాఖీ కట్టడానికి రానా?’ అని ఆమె మెసేజ్ చేయగా, ఆయన చాలా ఆలస్యంగా ‘నేను ఔట్ ఆఫ్ స్టేషన్’ అని రిప్లై ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ వైరం వల్ల కొంతకాలంగా అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్ధలొచ్చిన సంగతి బహిరంగ రహస్యమే. కానీ KTR కావాలనే అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ చర్చపై మీ COMMENT?