News August 8, 2024
గర్ల్ ఫ్రెండ్‌కు ఐఫోన్ కోసం అమ్మ బంగారం దొంగతనం!

ఓ బాలుడు తన గర్ల్ ఫ్రెండ్‌కు ఐఫోన్ కొనిచ్చేందుకు తన తల్లి బంగారాన్నే దొంగతనం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని నజఫ్గఢ్లో జరిగింది. ఓ పాఠశాలలో 9వ తరగతి చదివే అబ్బాయి తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఐఫోన్ కొనిద్దామనుకున్నాడు. డబ్బులు లేక అతడి తల్లి నగలనే దొంగిలించి, విక్రయించగా వచ్చిన రూ.50 వేలతో ఐఫోన్ కొనిచ్చాడు. నగలు చోరీ అయ్యాయని తల్లి ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది.
Similar News
News November 13, 2025
IRCTCలో 46 ఉద్యోగాలు

<
News November 13, 2025
మెన్స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

ఒక మెన్స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్ స్కిప్పింగ్ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.
News November 13, 2025
కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.


