News December 14, 2024
అమ్మా.. నీ ప్రేమే మమ్మల్ని కలిపి ఉంచింది: మంచు మనోజ్

తన తల్లి బర్త్ డే సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఆమెకోసం భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘హ్యాపీ బర్త్డే అమ్మా. మన కుటుంబానికి హృదయానివి, ఆత్మవి నువ్వే. నీ ప్రేమ, దయ మమ్మల్ని ఎన్ని కష్టాలొచ్చినా కలిపి ఉంచింది. నీ ధైర్యం నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తుంటుంది. ప్రపంచంలోని శాంతి, సంతోషం, ప్రేమ అంతా నీకు దక్కాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా ఎప్పుడూ నీతోనే ఉంటాను’ అని పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
ఆసిఫాబాద్: రైతులకు 50% రాయితీపై ప్లాస్టిక్ బుట్టలు

ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు 50% రాయితీపై ప్లాస్టిక్ బుట్టలు అందించనున్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి నదీమ్ తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 40 బుట్టలు ఇవ్వనున్నారు. ఒక్కో బుట్ట ధర రూ.337 కాగా, రైతు వాటా రూ.168.50 అన్నారు. 40 బుట్టలకు రూ.6,740 డీడీ చెల్లించాలని వివరించారు.
News January 29, 2026
‘వారణాసి’ మూవీ రిలీజ్ తేదీ ఇదేనా?

సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. వారణాసి పట్టణంలో ‘ఏప్రిల్ 7 2027న థియేటర్లలో విడుదల’ అనే హోర్డింగ్స్ ఏర్పాటు చేయగా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఆరోజునే ఉగాది ఉండటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
News January 29, 2026
నాపై తప్పుడు ప్రచారం చేశారు: శశి థరూర్

పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న MP శశి థరూర్ ఎట్టకేలకు INC చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో వారిద్దరిని కలిశారు. సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని అనంతరం థరూర్ మీడియాకు చెప్పారు. ‘అంతా బాగానే ఉంది. మేమంతా ఒకే మాట మీద ఉన్నాం. నేను ఎప్పుడూ పార్టీ కోసమే పనిచేశాను. ఏనాడూ పదవులు అడగలేదు. నాపై తప్పుడు ప్రచారం చేశారు’ అని అన్నారు.


