News May 23, 2024

అమ్మ మరణం నన్ను బాధించలేదన్నారు: జాన్వీ కపూర్

image

అమ్మ శ్రీదేవి మరణం తనను బాధించలేదని కొందరు నిందించారని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటికి రావడానికి పనిపై ఫోకస్ చేశా. కానీ ఇదే కొంతమందికి నచ్చలేదు. ఆమెపై నాకు ప్రేమ లేదని అనుకున్నారు. ఆమె మరణం నన్ను ప్రభావితం చేయలేదని భావించారు. కానీ అది నిజం కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News January 22, 2026

హనుమాన్‌పేట్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక

image

విజయవాడ హనుమాన్‌పేటలోని ఏపీలోని అన్ని జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి, విద్యార్థుల పౌరహక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోగా, రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News January 22, 2026

SKLM: ‘లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం’

image

సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ యాక్ట్ అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లు కేవలం వైద్య అవసరాలకే పరిమితం చేయాలన్నారు. మితిమీరితే లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. DMHO అనిత ఉన్నారు.