News February 16, 2025
తొలిసారి 5 స్టార్ హోటల్లో మోనాలిసా భోజనం

తన కళ్లతో కుంభమేళాలో అందరినీ ఆకర్షించి రాత్రికి రాత్రే స్టార్గా మారిపోయింది మోనాలిసా. ఇటీవల తొలిసారి ఫ్లైట్ ఎక్కిన ఆమె, తాజాగా ఫస్ట్ టైం 5 స్టార్ హోటల్కు వెళ్లింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అందులో భోజనం చేసింది. ఆమె నటిస్తున్న మూవీ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ఇక్కడకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కుటుంబంతో కలిసి 5 నక్షత్రాల హోటల్లో మోనాలిసా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Similar News
News November 25, 2025
ఇల్లు లేదా.. GOOD NEWS తెలిపిన బాపట్ల కలెక్టర్

జిల్లాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు స్థల సేకరణలో తగు చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. బాపట్ల జిల్లాలోని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాలోని బాపట్ల, చీరాల, అద్దంకి, రేపల్లె నియోజకవర్గాల్లో సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 25, 2025
బస్సు టికెట్ ఛార్జీలు పెంచినప్పుడు అడగరెందుకు?: శివాజీ

సినిమా టికెట్ ధరల పెంపుపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇండస్ట్రీలో 95శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు. ఇక్కడ అందరికీ లగ్జరీ లైఫ్ అంటూ ఉండదు. మూవీ టికెట్ రేట్లు పెరిగాయి అంటున్నారు. సంక్రాంతి టైమ్లో బస్సు ఛార్జీలు 3 రెట్లు పెంచుతారు. అప్పుడు ఎందుకు ఎవరూ మాట్లాడరు? అదే మూవీ టికెట్ రేటు పెరగ్గానే విలన్లా చూస్తారు. ఇది కరెక్ట్ కాదు’ అని శివాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మీ కామెంట్?
News November 25, 2025
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో (డిసెంబర్ 11, 14, 17) పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉ.7 నుంచి మ.1 వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2PM నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.


