News February 4, 2025
మూడేళ్ల కిందటే మోనాలిసాకు ఫొటోషూట్

తేనెకళ్ల సుందరి మోనాలిసాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితమే ఆమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. 2022లో మహేశ్వర్ అహిళ్యాదేవికోటలో ‘పరికర్మ’ మూవీ షూట్ జరిగింది. ఇది చూసేందుకు మోనాలిసా రాగా ఫొటోగ్రాఫర్ సంజీత్ చౌదరి ఆమెను చూశారు. వెంటనే ఆమెను ఒప్పించి ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలను సంజీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’లో నటిస్తున్నారు.
Similar News
News January 24, 2026
ఎల్లుండి విజయ్-రష్మిక కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్

రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా VD14 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1854-1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్-రష్మిక చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం. త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నట్లూ ప్రచారం జరుగుతోంది.
News January 24, 2026
యాత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,979 పోస్టులు

యాత్ర ఇండియా లిమిటెడ్ 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, టెన్త్ అర్హత గలవారు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అర్హత గలవారికి నెలకు రూ.8200, ఐటీఐ అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://recruit-gov.com/
News January 24, 2026
మీడియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ

అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్ (Indo Asian News Service)లో మిగిలిన 24% వాటాను కొనుగోలు చేసింది. దీంతో IANS పూర్తిగా అదానీ గ్రూప్ సంస్థగా మారింది. ఇప్పటికే 2023 డిసెంబరులో 50.5% ఉన్న వాటాను 2024 జనవరిలో 76 శాతానికి పెంచుకున్నారు. NDTV, బీక్యూ ప్రైమ్ తర్వాత ఐఏఎన్‌ఎస్ కూడా చేతికి రావడంతో మీడియాలో అదానీ ప్రభావం మరింత పెరగనుంది.


