News February 15, 2025

హీరోయిన్‌లా మోనాలిసా.. PHOTO

image

కుంభమేళాలో ఆకర్షించే కళ్లతో పూసలు అమ్ముతూ ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా కొత్త ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేరళలో ఓ జువెల్లరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు రెడ్ గాగ్రాలో ఉన్న ఆమెను కెమెరామెన్ క్లిక్ అనిపించాడు. ఆ ఫొటోను పోస్ట్ చేసిన మోనాలిసా లవ్ కేరళ అంటూ లవ్ సింబల్‌ను పంచుకున్నారు. దీంతో హీరోయిన్‌లా ఉన్నావంటూ, ఆల్ ది బెస్ట్ చెబుతూ నెటిజన్లు ఆ ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Similar News

News November 18, 2025

‘VSP STEEL’ ప్రైవేటీకరణకు CBN కుట్ర: రజిని

image

AP: కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే కుట్రలకు CBN తెరలేపారని మాజీ మంత్రి రజిని ఆరోపించారు. వైట్ ఎలిఫెంట్ అన్న ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. NDAలో భాగం కాకున్నా జగన్ తన హయాంలో ప్రైవేటుపరం కాకుండా ఆపారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP సపోర్టుతో నడుస్తున్నా ఆ దిశగా కదులుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు బాబు ప్లాంటుకు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.

News November 18, 2025

ఏపీ అప్డేట్స్

image

* రాష్ట్రంలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెండ్ల.. ఇప్పటికే రూ.560 కోట్లు ఖాతాల్లో జమ చేశామని ప్రకటన
* రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.6.22 కోట్లు మంజూరు.. గురుకుల హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లకు రూ.3.06 కోట్లు
* పరకామణి చోరీ ఘటనపై తిరిగి కేసు నమోదు చేయాలని TTD పాలక మండలి సమావేశంలో నిర్ణయం

News November 18, 2025

లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎంకు సమన్లు

image

మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ CM, BJP నేత BS యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది FEBలో మీటింగ్ కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన 17 ఏళ్ల కూతురిని యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈక్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.