News November 8, 2024
రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న
AP: వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి నిబంధనల అడ్డు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమచేస్తామని పునరుద్ఘాటించారు. రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని స్పష్టం చేశారు.
Similar News
News November 8, 2024
రంజీల్లో ఆడటం వృథానేనా?: హర్భజన్
రంజీల్లో 6000 రన్స్, 400 వికెట్స్ తీసిన తొలి క్రికెటర్గా కేరళ ప్లేయర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించారు. అయితే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయట్లేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ హర్భజన్ ‘అతడిని ఇండియా-Aకైనా ఎంపిక చేయాల్సింది. రంజీల్లో ఆడటం వృథానేనా? ప్లేయర్లు IPL నుంచే ఎంపికవుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
News November 8, 2024
ఏ వయసులో స్మోకింగ్ మానేసినా ప్రయోజనాలుంటాయ్
దశాబ్దాల పాటు స్మోకింగ్ చేసి లేటు వయసులో మానేయడం వల్ల ఉపయోగం లేదనే కొందరి వాదన తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఎంత పొగతాగేవారైనా, ఏ వయసులోనైనా దాన్ని వదిలేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చంటున్నారు. ‘1-2ఏళ్లు మానేస్తే గుండె వ్యాధులు, 5-10ఏళ్ల తర్వాత క్యాన్సర్ ముప్పు సగానికి తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి’ అని పేర్కొంటున్నారు.
News November 8, 2024
నా పోరాటం కొనసాగిస్తా: కేఏ పాల్
AP: తిరుమలను <<14559672>>కేంద్ర పాలిత ప్రాంతం<<>> చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై KA పాల్ స్పందించారు. ‘తిరుమల వ్యవహారంపై నా పోరాటం ఆపను. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. తిరుమలలో గొడవలు ఆగాలంటే కేంద్రం పాలిత ప్రాంతం చేయాల్సిందే. నా పిటిషన్ను విచారించిన ధర్మాసనానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.