News January 2, 2025

GOOD NEWS: ప్రభుత్వం సంక్రాంతి కానుక!

image

TG: రైతు భరోసాపై ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ జరగనుంది. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే అవకాశముంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ స్పష్టత రానుంది. కాగా ఏడాదికి ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతులకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News October 17, 2025

దీపావళి రోజు ఏం చేయాలంటే?

image

దీపావళి ముందురోజే ఇంటిల్లిపాది నూనెతో అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘పండుగరోజు ఉదయమూ తలస్నానం చేయాలి. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి దీపావళికి తప్పకుండా అమ్మవారిని పూజించాలి. సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు వేయాలి. దీపాలు వెలిగించి, అమ్మవారికి షడ్రుచులతో వంటకాలు నివేదించాలి. పూజ పూర్తయ్యాక ఆ దీపాలను ఇంటి ముందు, తులసి కోట వద్ద అలంకరించుకోవాలి’ అని చెబుతున్నారు.

News October 17, 2025

HUDCOలో 79 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) 79 మేనేజర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్, CA/CMA, LLB, LLM, MBA, PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hudco.org.in/

News October 17, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

*బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కంధపురి’ ఇవాళ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.
*ఈనెల 31న విడుదలయ్యే ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు.
*ఇవాళ ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దేనికి వెళ్తున్నారు?