News October 4, 2024

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు ₹500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News November 14, 2025

రహదారిపై షెడ్లు, నిర్మాణాలు చేయవచ్చా?

image

ఇంటి ముందు దారిపై వాహనం నిలపడం, కారు పార్క్‌కు షెడ్లు వేయడం సరికాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తమ సొంత స్థలంలో ఇలాంటి నిర్మాణాలు చేసుకోవాలి కానీ, అందరికీ చెందాల్సిన రహదారిలో ఆటంకం కలిగించేలా నిర్మాణాలు చేయడం ఆ ఇంటికి, ఇంట్లో సభ్యులకు మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ధోరణితో గొడవలు, ప్రమాదాలకు ఆస్కారం ఉంది. వాస్తు శాంతికి సామాజిక శాంతి కూడా ముఖ్యమే’ అని అంటారు. <<-se>>#Vasthu<<>>

News November 14, 2025

అవకాశాలను అందిపుచ్చుకోవడంలో CBN టాప్: పీయూష్

image

AP: భవిష్యత్‌ను ముందే ఊహించి CBN అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ CII సదస్సులో కొనియాడారు. ఒకప్పుడు IT, ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటమ్‌లలో ముందున్నారని చెప్పారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని CM తెలిపారు. APలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. డ్రోన్, స్పేస్ సిటీలకు CM, మంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

News November 14, 2025

కాంగ్రెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

image

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.