News December 28, 2024

అకౌంట్లోకి డబ్బులు.. BIG UPDATE

image

TG: సంక్రాంతి నుంచి రైతుభరోసా పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ డాటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.

Similar News

News December 29, 2024

షిప్ నుంచి రేషన్ బియ్యం అన్‌లోడ్

image

AP: కాకినాడలో స్టెల్లా షిప్‌లో ఇటీవల భారీ మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ అక్రమరవాణాపై ఏకంగా Dy.CM పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రేషన్ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేశారు. మొత్తం 1,320 టన్నుల బియ్యాన్ని పోర్టులోని గోడౌన్‌లో భద్రపరిచారు. మరోవైపు షిప్‌లో 19,785 టన్నుల బియ్యం లోడ్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

News December 29, 2024

అంతటా బుమ్రానే..

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై బుమ్రా బౌలింగ్‌ను ఉద్దేశించి ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు ఆకట్టుకుంటోంది. ‘కంగారూలు దూకగలవు కానీ బుమ్రా నుంచి దూరంగా పారిపోలేవు’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ అంతటా బుమ్రానే ఉన్నారని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే బుమ్రా 29 వికెట్లు తీశారు.

News December 29, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ రేట్లు కాస్త తగ్గాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ రూ.150, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ధరలు రూ.190, రూ.220గా ఉన్నాయి. మరోవైపు ఏపీలోని విజయవాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.220-230 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.