News February 28, 2025
అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన

TG: రైతుభరోసా డబ్బుల జమపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతన్నలకు నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, పథకాల అమలు పురోగతిపై బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించారు.
Similar News
News November 2, 2025
మహేశ్‌ని అలా ఎప్పుడూ అడగలేదు: సుధీర్ బాబు

తన సినిమాల్లో హిట్లున్నా, ఫ్లాపులున్నా పూర్తి బాధ్యత తనదేనని హీరో సుధీర్ బాబు ‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘కృష్ణకు అల్లుడు, మహేశ్‌కు బావలా ఉండటం గర్వకారణం, ఓ బాధ్యత. కృష్ణానగర్‌లో కష్టాలు నాకు తెలియదు. కానీ, ఫిల్మ్‌నగర్ కష్టాలు నాకు తెలుసు. నాకో పాత్రగానీ, సినిమాగానీ రికమెండ్ చేయమని నేను మహేశ్‌ను ఎప్పుడూ అడగలేదు’ అని తెలిపారు. జటాధర మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 2, 2025
ధ్వజస్తంభాన్ని ఎలా తయారుచేస్తారు?

ధ్వజస్తంభాన్ని పలాస, రావి, మారేడు వంటి పవిత్ర వృక్షాల కలపతో తయారుచేసి, ఇత్తడి లేదా బంగారు తొడుగు వేస్తారు. దీని కింద వైష్ణవాలయాల్లో సుదర్శన చక్రం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నాలు ఉంటాయి. దీనికి జీవధ్వజం అనే పేరు కూడా ఉంది. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి. ధ్వజస్తంభం పవిత్రత, శక్తిని కలిగి ఉండటానికి నిత్య అనుష్ఠానాల వల్ల భగవంతుని చూపు దీనిపై పడుతుంది.
News November 2, 2025
నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


