News October 23, 2024

24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి

image

AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

కారిడార్ భూముల్లో పర్యటించిన పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి

image

నక్కపల్లి మండలంలోని విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూములను శుక్రవారం పరిశ్రమలశాఖ రాష్ట్ర కార్యదర్శి యువరాజ్ పరిశీలించారు. త్వరలో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమల కోసం ఏపీఐఐసీ చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. సబ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మిట్టల్-నిప్పన్ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించిన భూములను పరిశీలించారు.

News December 6, 2025

NLG: గ్లోబల్ సమ్మిట్‌కు ఏపీ సీఎంకు ఆహ్వానం

image

తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈనెల 8-9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు రావాలని సీఎం చంద్రబాబుకు అధికారిక ఆహ్వానం అందించారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచ, జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొంటారని తెలిపారు.

News December 6, 2025

శుభ సమయం (6-12-2025) శనివారం

image

➤ తిథి: బహుళ విదియ రా.12.54 వరకు
➤ నక్షత్రం: మృగశిర ఉ.11.58 వరకు
➤ శుభ సమయాలు: ఉ.10.40-మ.12.00, సా.3.20-5.20
➤ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
➤ యమగండం: మ.1.30-మ.3.00
➤ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
➤ వర్జ్యం: ఉ.7.52-ఉ.9.22
➤ అమృత ఘడియలు: రా.1.09-2.39 వరకు