News February 9, 2025

రేపు వారి ఖాతాల్లోకి డబ్బులు!

image

TG: రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే ఎకరా వరకు భూమి ఉన్న వారికి ప్రభుత్వం రూ.6 వేల చొప్పున జమ చేసింది. గతంలోలాగా ఎకరా, రెండు ఎకరాలు, 3 ఎకరాలకు విడతల వారీగా రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో దాదాపు 17 లక్షల మందికి డబ్బులు ఖాతాల్లో వేసినట్లు సమాచారం.

Similar News

News March 18, 2026

సన్‌రైజర్స్ వివాదం ముందే ఊహించాం: పీసీబీ వర్గాలు

image

The Hundred లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ కొనుగోలు చేయడంపై <<19368622>>తీవ్ర దుమారం<<>> రేగడం తెలిసిందే. అయితే దీన్ని ముందే ఊహించామని పీసీబీ వర్గాలు చెప్పాయి. ‘అబ్రార్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ తీసుకోవడంపై జరుగుతున్న రచ్చ మేం ఊహించనిదేమీ కాదు. అతడేమీ పెద్దగా టెన్షన్ పడటం లేదు. ఇది ECB, ఫ్రాంచైజీకి సంబంధించిన విషయం’ అని తెలిపినట్లు టెలికం ఆసియా స్పోర్ట్స్ వెల్లడించింది.

News March 18, 2026

మొజ్తబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని వెతికి పట్టుకుని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. ‘ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తాం. మా దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి <<19410383>>తప్పించుకోలేరు<<>>. వారిని వెంబడిస్తాం. కనుగొంటాం. హతమారుస్తాం’ అని IDF ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. అయితే మొజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం లేదని చెప్పారు.

News March 18, 2026

రేణు దేశాయ్‌పై అసభ్య పోస్టులు.. ఇద్దరి అరెస్ట్

image

నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో <<19265289>>అసభ్యకర పోస్టులు<<>> పెట్టిన ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అశ్లీల పదజాలంతో వేధిస్తున్నారని ఇటీవల 4 SM అకౌంట్లపై రేణు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. SMలో వేధించే కేటుగాళ్లను వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. బాధితులు తమను సంప్రదించాలని సూచించారు.