News February 10, 2025

ఇవాళ లేదా రేపు ఖాతాల్లోకి డబ్బులు!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనుంది. ఇవాళ లేదా రేపు ఎకరాకు రూ.6వేల చొప్పున వేయనుంది. ఇప్పటికే ఒక్క ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో సర్కార్ నగదు జమ చేసింది. జమ కాని వారు సంబంధిత ఏఈవో లేదా ఏవోను సంప్రదించాలి. కాగా ఏటా ఎకరానికి రూ.12వేల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

Similar News

News March 11, 2026

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపండి: US

image

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరినట్లు US మీడియా సంస్థ Axios పేర్కొంది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు చేస్తే ఆ దేశ ప్రజలకు హాని కలగవచ్చని, ఆయిల్ ధరలు భారీగా పెరగొచ్చని US చెప్పినట్లు తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశమూ ఉందని, యుద్ధం తర్వాత ఆయిల్ సెక్టార్‌కు ఇరాన్ సహకారం అవసరమని US భావిస్తోందని వెల్లడించింది.

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 11, 2026

నేడు కేరళ, తమిళనాడుకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం కేరళలోని కొచ్చిలో ₹10,800కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం TNలోని తిరుచిరాపల్లిలో ₹5,650కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు ముందే మధురై ఎయిర్‌పోర్టుకు కేంద్రం అంతర్జాతీయ హోదాను ప్రకటించింది. ఈ విజిట్‌తో మోదీ ఇరు రాష్ట్రాల్లో అధికారికంగా NDA ఎన్నికల ఢంకా మోగించనున్నట్లు తెలుస్తోంది.