News October 22, 2024
2 రోజుల్లోనే అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి నాదెండ్ల

AP: ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. మొదటి రకం వడ్లను మద్దతు ధర రూ.2,350తో కొంటామన్నారు. రైతులు వారికి నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. గోనెసంచులు, హమాలీ, రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
Similar News
News November 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూ.202.93 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం 18,247 మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, మొత్తం రూ.2,900 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.
News November 11, 2025
బిహార్, జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్

బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు TGలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. బిహార్‌లో ఈనెల 6న 121 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగగా 65.08% పోలింగ్ నమోదైంది. ఇవాళ 122 స్థానాలకు సా.5 గంటల వరకు 67.14% ఓటింగ్ రికార్డయింది. జూబ్లీహిల్స్‌లో సా.5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా సా.6లోపు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు.
News November 11, 2025
గూగుల్ కొత్త ఫీచర్.. బ్యాటరీ తినేసే యాప్స్‌కు చెక్!

బ్యాటరీ తినేసే యాప్‌లకు చెక్ పెట్టే కొత్త ఫీచర్‌ను 2026 మార్చి 1 నుంచి గూగుల్ అమలులోకి తెస్తోంది. 24 గంటల్లో 2 గంటలకు మించి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయితే దానిని బ్యాటరీ డ్రెయిన్ యాప్‌గా గుర్తిస్తారు. వీటిపై డెవలపర్స్‌ను గూగుల్ ముందుగా అలర్ట్ చేస్తుంది. సమస్యను ఫిక్స్ చేయకుంటే ప్లేస్టోర్‌లో ప్రాధాన్యం తగ్గిస్తుంది. యాప్స్‌ను ప్లేస్టోర్‌లో డౌన్లోడ్, అప్డేట్ చేసుకునేటప్పుడు యూజర్లను హెచ్చరిస్తోంది.


