News November 21, 2024

అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది. ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.

Similar News

News November 21, 2024

పిల్లలు పిట్టల్లా రాలుతుంటే.. CM పిట్టలదొర మాటలు: KTR

image

TG: ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాలల్లో 40 మందికి పైగా విద్యార్థులు మరణించారని KTR ట్వీట్ చేశారు. ‘పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా CM రేవంత్ వేదికల మీద పిట్టలదొర మాటలు చెబుతుండు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్ మహిళలను కోటీశ్వరులను చేస్తాడట’ అని సెటైర్లు వేశారు. ‘దవాఖానల్లో విద్యార్థులు, చెరసాలలో రైతన్నలు, ఆందోళనలో నిరుద్యోగులు’ అని పేర్కొన్నారు.

News November 21, 2024

పేసర్లు కెప్టెన్‌గా ఉండాలి: బుమ్రా

image

BGT నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ బుమ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేనెప్పుడూ పేసర్లు కెప్టెన్‌గా ఉండాలని వాదిస్తా. వారు వ్యూహాత్మకంగా మెరుగ్గా ఉంటారు. గతంలోనూ ఎన్నో ట్రోఫీలు ఇండియా గెలిచింది. ఈసారి పేసర్ కెప్టెన్సీలో కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుంది అనుకుంటున్నా’ అని తెలిపారు. 2017, 2019, 2021, 2023లో ఇండియా BGT గెలుపొందింది. కాగా, ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు దిగిన ఫొటో వైరలవుతోంది.

News November 21, 2024

NEW RECORD: రూ.82 లక్షలను తాకిన బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. తొలిసారి $95000ను తాకింది. మరికాసేపటికే $97,500 స్థాయికి దూసుకెళ్లింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.82లక్షలుగా ఉంది. మూమెంటమ్ ఇలాగే కొనసాగితే $100,000ను తాకడానికి మరెంతో సమయం పట్టదు. US ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికవ్వడం, బ్లాక్‌రాక్ కొత్తగా ఆప్షన్లను ప్రవేశపెట్టడంతో BTC దూసుకెళ్తోంది.