News July 30, 2024
నేడు అకౌంట్లలో డబ్బులు జమ

TG: రెండో విడత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో ₹లక్ష లోపు దాదాపు 11.50 లక్షల మంది రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం ₹6,035 కోట్లు ఖర్చు చేసింది. రెండో విడతలో భాగంగా ₹లక్ష నుంచి ₹లక్షన్నర రుణాలను మాఫీ చేయనుంది. ఈ ప్రక్రియను CM రేవంత్ అసెంబ్లీ ఆవరణలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మంది రైతులకు ₹7వేల కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
Similar News
News December 1, 2025
వర్క్ స్ట్రెస్తో సంతానలేమి

పనిఒత్తిడి సంతానోత్పత్తిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. తీవ్రఒత్తిడికి గురైనప్పుడు శరీరం స్ట్రెస్ హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇవి స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమైన ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తిని, సమతుల్యతను దెబ్బతీస్తాయి. స్త్రీలలో అండాల విడుదల (ఓవ్యులేషన్) ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు.
News December 1, 2025
పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్ విధించనున్నట్లు సమాచారం.
News December 1, 2025
ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.


