News March 29, 2024

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి డబ్బులు కంటెయినర్‌లో పోతున్నాయి: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ మొన్నటి వరకు పరదాల చాటున తిరిగారని, ఇప్పుడు బయటికి వస్తే ప్రజలు పారిపోతున్నారని TDP చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడి కత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు వివేకా హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని ఆలోచిస్తున్నారు. మద్యం, ఇసుకలో దోచుకున్న సొమ్ములు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్‌లో తరలిపోతున్నాయి. డబ్బుతో ఓట్లు కొనాలనుకుంటున్నారు’ అని ఆరోపించారు.

Similar News

News November 25, 2025

నేడు హనుమకొండలో బీజేపీ రైతు దీక్ష

image

రైతుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఏకశిల పార్క్‌లో మహా రైతు దీక్ష చేపట్టానున్నారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు.

News November 25, 2025

మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

image

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్‌ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.

News November 25, 2025

నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

image

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.