News August 5, 2024
48 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేయాలి: సీఎం

AP: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలను పక్కనపెట్టాలని సూచించారు. రైతులకు అనుకూలంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. రేషన్ షాపుల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు.
Similar News
News April 10, 2026
కాక్‌టెయిల్-2 షూటింగ్.. బీచ్‌లో రష్మిక చిల్

కృతి సనన్‌తో కలిసి బీచ్‌లో చిల్ అవుతున్న ఫొటోను రష్మిక మందన్నా ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘కాక్‌టెయిల్-2’ షూటింగ్ గ్యాప్‌లో తీసుకున్న ఫొటో ఇది. ఇందులో రష్మిక ఆరెంజ్ కో-ఆర్డ్ సెట్‌లో మెరిసిపోతుండగా, కృతి ఫ్లోరల్ డ్రెస్‌లో కనిపించారు. సాంగ్ షూటింగ్ సమయంలో ఈ పిక్ తీసినట్లు తెలుస్తోంది. హోమీ అదజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ సీక్వెల్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.
News April 10, 2026
మచ్చలున్న మామిడి పండ్లు తింటున్నారా?

మార్కెట్లో కనిపించే కొన్ని మామిడి పండ్లపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. తోటలో ఎక్కువ తేమ కారణంగా మామిడి కాయలు చెట్టుపై ఉన్నప్పుడే ఫంగస్, బాక్టీరియా వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. దీంతో పండ్లు దెబ్బతింటాయి. ఇవి తింటే అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని కొనకపోవడం బెటర్. ఇక మామిడి రైతులు నల్ల మచ్చలు వచ్చిన కాపునకు నీళ్లు ఎక్కువ పెట్టొద్దు.
News April 10, 2026
ఎల్లుండి ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 12న రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. అత్యంత వేగంగా, సులువుగా Way2newsలో మీ ఫలితాలు తెలుసుకోండి.


