News September 13, 2025
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సూపర్ ఫైన్ రకం అంచనాలకు మించి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే రేషన్ బియ్యంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.
Similar News
News September 13, 2025
థియేటర్లలో ‘మహావతార్ నర్సింహా’.. @50 డేస్

మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ‘మహావతార్ నర్సింహా’ యానిమేటెడ్ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 200కు పైగా థియేటర్లలో ఈ సినిమా ఆడుతోందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
News September 13, 2025
త్వరలో జాబ్ కాలెండర్ విడుదల: మంత్రి పొన్నం

TG: జాబ్ క్యాలెండర్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపామన్నారు. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.
News September 13, 2025
నేపాల్ పార్లమెంట్ రద్దు.. ఎన్నికల తేదీ ప్రకటన

నేపాల్‌లో వచ్చే ఏడాది మార్చి 5న ఎలక్షన్స్ జరగనున్నట్లు ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. నిన్న తాత్కాలిక ప్రధాన మంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆమె నేతృత్వంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు రద్దుకు ఆమోదం తెలిపారు.