News October 6, 2024
రేపు వారి అకౌంట్లలో డబ్బులు జమ

AP: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.
Similar News
News February 1, 2026
120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

BSNLలో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెలికంలో 95, ఫైనాన్స్‌లో 25 ఉద్యోగాలున్నాయి. జాబును బట్టి BE/BTech(ఎలక్ట్రానిక్స్& టెలికమ్యూనికేషన్స్), CA/CMA పాసైన వారు అర్హులు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://bsnl.co.in/
News February 1, 2026
బడ్జెట్ 2026-27: రూపాయి రాక, పోక ఇలా

రూపాయి వచ్చేది: రుణాలు 24%, ఆదాయపు పన్ను 21%, కార్పొరేట్ పన్ను 18%, GST, ఇతర పన్నులు 15%, కస్టమ్స్ 4%, ఎక్సైజ్ డ్యూటీలు 6%, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ 10%, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్ 2%.
రూపాయి పోక: రాష్ట్రాల వాటా 22%, ఆర్థిక సంఘం 7%, కేంద్ర ప్రాయోజిత పథకాలు 8%, వడ్డీలు 20%, రక్షణ 11%, సబ్సిడీలు 6%, కేంద్ర ప్రభుత్వ రంగాల పథకాలు 17%, పింఛన్లు 2%, ఇతర కేటాయింపులు 7%.
News February 1, 2026
ఏపీ ముఖ్యమైన కేటాయింపులు ఇలా..

* అమరావతి రాజధాని అభివృద్ధి(ఏడీబీ నిధులు)- రూ.1,128 కోట్లు
* అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్(జపాన్ నిధులు)- రూ.432 కోట్లు
* గ్రామీణ రహదారులు- రూ.500 కోట్లు
* పట్టణాల్లో తాగు, మురుగు నీటి పారుదల- రూ.800 కోట్లు
* ప్రకృతి వ్యవసాయం- రూ.155 కోట్లు
* రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం- రూ.350 కోట్లు


