News January 5, 2025

రేపు అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్లకు రేపు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. కాగా ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందాయి. మరోవైపు పింఛన్లను కూడా డిసెంబర్ 31నే ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 7, 2025

సింగిల్ పేరెంట్‌గా లైఫ్ ఎలా ఉంది? సానియా సమాధానమిదే

image

సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ గతేడాది JANలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి అబ్బాయి ఇప్పుడు సానియా వద్దే ఉంటున్నారు. ఈక్రమంలోనే సింగిల్ పేరెంట్‌గా జీవితం ఎలా ఉందని ఆమెకు ప్రశ్న ఎదురైంది. అయితే ప్రస్తుతం తన ప్రపంచమంతా కొడుకు ఇజానేనని సానియా తెలిపారు. అతడిని ఎప్పుడూ విడిచి పెట్టి ఉండటానికి ఇష్టపడనని చెప్పుకొచ్చారు. అటు వర్క్‌ని, కొడుకు బాగోగులను బ్యాలెన్స్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

News January 7, 2025

చలికాలం ఎక్కువగా తలనొప్పి వస్తోందా?

image

వింటర్‌లో సరిగ్గా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. దీంతో తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా మజిల్స్ రిలాక్సై తలనొప్పి తగ్గుతుంది. హెడెక్ ఉన్న ట్రిగ్గర్ పాయింట్ వద్ద మసాజ్ థెరపీతోనూ ఉపశమనం పొందొచ్చు. ఇక తల, మెడ, భుజాలపై హీటింగ్ ప్యాడ్స్‌ పెట్టడం వల్ల కూడా రిలీజ్ లభిస్తుంది.

News January 7, 2025

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. తనపై ఏసీబీ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10:30కు తీర్పు వెల్లడించనుంది. క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.