News June 2, 2024

APని తాకిన రుతుపవనాలు

image

AP: నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత ఈ నెల 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా.. ముందుగానే ప్రవేశించాయి.

Similar News

News October 21, 2025

డాక్టరేట్‌ సాధించిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ

image

సైన్స్‌‌లో డాక్టరేట్‌ పొందిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ. పైటోమెడిసిన్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నిపుణురాలైన ఈమె మూర్చ, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ఖైరా ప్రొఫెసర్‌షిప్‌ పొందారు. అక్కడ పలు విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్‌ అకాడమీ ఫెలోషిప్, 1961లో కెమిస్ట్రీలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్‌ భట్నాగర్‌’ అవార్డు పొందారు.

News October 21, 2025

అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కన్నుమూత

image

అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియెల్ నరోడిట్స్కీ(29) కన్నుమూశారు. ‘టాలెంటెడ్ చెస్ ప్లేయర్, ఎడ్యుకేటర్, చెస్ కమ్యూనిటీలో ప్రియమైన సభ్యుడు తుదిశ్వాస విడిచారు’ అని నార్త్ కరోలినాలోని చార్లెట్ చెస్ క్లబ్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. అయితే ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. 18 ఏళ్లకే డానియెల్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు. ఆయన అండర్-12 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచారు.

News October 21, 2025

గ్రామాల రక్షణకు మహిళల గ్రీన్ ఆర్మీ

image

UP వారణాసి గ్రామాల్లో పరిశుభ్రత, చైతన్యం కోసం మహిళలతో ఏర్పడిన గ్రీన్‌ఆర్మీ ఎన్నో సాంఘిక సంస్కరణలు చేస్తోంది. 2015లో రవిమిశ్ర అనే వ్యక్తి ప్రారంభించిన ఈ ఉద్యమం 22 జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ ఆర్మీలో 2,200 మంది మహిళలు ఉన్నారు. వీరు గృహహింస, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు సహకరిస్తున్నారు. చెప్పులు, నారసంచుల తయారీతో ఉపాధి కూడా పొందుతున్నారు. వీరి కృషిని గుర్తించి PM మోదీ కూడా అభినందించారు.