News June 3, 2024

తెలంగాణను తాకిన రుతుపవనాలు.. భారీ వర్షాలు

image

TG: నైరుతి రుతుపవనాలు తెలంగాణ తీరాన్ని తాకాయి. నాగర్‌కర్నూల్, గద్వాల్, నల్గొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారంలో పూర్తిగా రాష్ట్రంలో విస్తరించనున్నాయి. రాష్ట్రంలో చురుగ్గా ఇవి కదులుతున్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. దీంతో రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.

Similar News

News January 17, 2026

అమరావతి రైతులకు ఒకేచోట ప్లాట్లు!

image

AP: అమరావతి రైతులకు వేర్వేరు చోట్ల ప్లాట్లు ఇవ్వడంతో వాటిని అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. చాలా ఖర్చుతో కూడుకుని వారికి అప్పగించడం ఆలస్యమైంది. దీంతో 2వ విడత 20,494 ఎకరాలు సేకరిస్తున్న ప్రాంతంలో రైతులకు ఒకే చోట ప్లాట్లు కేటాయించాలని భావిస్తోంది. ఇలా ఇవ్వడం వల్ల CRDAకి అందే స్థలమూ ఒకే ప్రాంతంలో ఉండి సంస్థలకు కేటాయింపులో మధ్యలో అడ్డంకులు ఉండవని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

News January 17, 2026

మరోసారి ముంబైని చిత్తు చేసిన యూపీ

image

WPL-2026: ముంబైపై మరోసారి యూపీ వారియర్స్ సత్తా చాటింది. ఇవాళ 22 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత యూపీ 187/8 రన్స్ చేయగా.. ముంబై 165 పరుగులకే పరిమితమైంది. యూపీ కెప్టెన్ లానింగ్ 45 బంతుల్లో 70 రన్స్‌తో రాణించారు. కాగా జనవరి 15న కూడా ముంబైపై యూపీ గెలిచిన సంగతి తెలిసిందే.

News January 17, 2026

JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు రిలీజ్

image

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగినై అధికారిక <>వెబ్‌సైట్‌‌ నుంచి<<>> హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెషన్-1 ఎగ్జామ్స్ ఈ నెల 21,22,23,24 తేదీల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 12న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సెషన్-2 ఎగ్జామ్స్ ఏప్రిల్‌లో జరుగుతాయి.