News June 20, 2024
నెలరోజులపాటు బోనాల పండుగ: పొన్నం

TG: ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు చెప్పారు. ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాం. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 7, 2025
అత్యాచార బాధితుల కోసం ఓ యాప్

ప్రస్తుతకాలంలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటితో పిల్లలకు ఎంతో మనోవ్యధ కలుగుతోంది. దీన్ని తగ్గించడానికి కేంద్రం POCSO e-box యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. ఈ యాప్ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కేసు అప్డేట్స్ కూడా ఇందులో తెలుసుకొనే వీలుంటుంది.
News December 7, 2025
విస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి

దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదుకాగా అందులో 8 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా, మరణాల రేటు 88% వరకు ఉండొచ్చని WHO తెలిపింది. ప్రస్తుతం టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.


