News October 29, 2025
‘మొంథా’ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వరికోతల సమయం కావడంతో ఆరబోసిన ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, రిజర్వాయర్ల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. హైడ్రా, ఇతర రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News October 29, 2025
హైదరాబాద్‌లో అతిపెద్ద మెక్ డొనాల్డ్స్ కేంద్రం ప్రారంభం

అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ‘గ్లోబల్ ఆఫీస్(గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్)’ను HYDలో ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. అమెరికా బయట మెక్ డొనాల్డ్స్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇది ఆ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రైస్ ఆపరేషన్స్‌కు ‘గ్లోబల్ హబ్’గా పని చేయనుంది. 1200 మంది(హై స్కిల్డ్)కి ఉపాధి లభించనుంది.
News October 29, 2025
కందలో అంతర పంటలు.. అంతర పంటగా కంద

కంద దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, తక్కువ కాలపరిమితి కలిగిన నువ్వు, మినుము, చిరుధాన్యాలు మొదలైన పంటలను అంతర పంటలుగా ఆయా ప్రాంతాలకు, కాలానికి తగిన విధంగా ఎంపిక చేసి సాగు చేసుకోవచ్చు. అలాగే పసుపులో మిశ్రమ పంటగా కందను వేసుకోవచ్చు. అరటి, కొబ్బరిలో అంతర పంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. పసుపులో కూడా కందను అంతర పంటగా వేసి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
News October 29, 2025
ప్రజలు తినే పంటలు పండిస్తే మంచిది: CBN

AP: రాయలసీమలో వరికాకుండా ఇతర పంటలు పండిస్తున్నారని, కోస్తాలో కూడా తినేరకాలు పండించాలని CBN రైతులకు సూచించారు. ‘పంటకు ఫలితం ఉండాలంటే తినే వాళ్లుండాలి. ప్రజలు తినని వాటిని పండిస్తే లాభమేంటి? ఇప్పటికే ధాన్యం వాడకం తగ్గిపోతోంది’ అని చెప్పారు. అలా చేయకుండా తనను ఎన్ని తిట్టినా ఫలితం లేదన్నారు. కార్బోహైడ్రేట్స్ ఉండే రైస్ తినకూడదని దానివల్లే అందరికీ షుగర్ అని అన్నారు. కోనసీమలో పంటల్ని CM పరిశీలించారు.


