News March 7, 2025
మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవు: L&T

మహిళా ఉద్యోగులకు ఎల్ అండ్ టీ శుభవార్త చెప్పింది. వారికి వేతనంతో కూడిన నెలసరి సెలవు(ఏడాదికి 12) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెలవును ఎలా అమలు చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయంతో దాదాపు 5వేల మందికి లబ్ధి చేకూరుతుంది. దేశంలో ఇలాంటి సెలవును ప్రకటించడం ఇంజినీరింగ్& కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి.
Similar News
News March 17, 2026
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)
News March 17, 2026
రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.