News September 2, 2025
నెలవారీ కోటా రేషన్ పంపిణీ పునః ప్రారంభం

TG: రాష్ట్రంలో సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్‌లో ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేయగా, మళ్లీ ఈ నెల నుంచి పాత పద్ధతిలో నెలవారీ కోటాను ఇస్తున్నారు. జులై, ఆగస్టులో కొత్త కార్డులు పొందిన వారికి కూడా ఈ నెల నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నారు. ఈ నెల 15 వరకు పంపిణీ కొనసాగనుంది. మొత్తం 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు 2.02లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు.
Similar News
News September 22, 2025
పవన్ అభిమానులకు ఇంకా నిరీక్షణే..

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్ననే ట్రైలర్ రావాల్సి ఉండగా పలు కారణాలతో రిలీజ్ కాలేదు. అయితే సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా ట్రైలర్ రాకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ఛాన్స్ ఉండటంతో రెండు రోజులు ముందు విడుదల చేస్తే ఎలా అని అంటున్నారు. ఇలాంటివి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచిస్తున్నారు.
News September 22, 2025
బీసీ కోటాను ఖరారు చేయాలని అధికారులకు CS ఆదేశాలు!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోటాను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను CS రామకృష్ణారావు ఆదేశించినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. BC బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం జీవోతో కోటాను అమలు చేస్తుందా అనేది ప్రశ్నగా మారింది.
News September 22, 2025
సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
1987: సినీ నటుడు ఉన్నిముకుందన్ జననం(ఫొటోలో)
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం