News November 12, 2024
మంత్లీ SIP: ఫస్ట్ టైమ్ రూ.25000 కోట్లతో రికార్డ్

భారత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి మంత్లీ సిప్ ఇన్‌ఫ్లో OCTలో రూ.25,000Cr చేరుకుంది. SEPలోని రూ.24,509Cr మార్కును దాటేసింది. 2023 OCTలో ఈ విలువ రూ.16,928 కోట్లే. మొత్తంగా ఈక్విటీ స్కీముల్లోకి రూ.41,886 కోట్ల ఇన్‌ఫ్లో వచ్చింది. ఇక రిటైల్ AUM OCTలో రూ.39,18,611 కోట్లుగా ఉంది. ప్రస్తుతం MF ఫోలియోస్ 21,65,02,804 ఉండగా రిటైల్ MF ఫోలియోస్ 17,23,52,296గా ఉన్నాయి.
Similar News
News November 10, 2025
కూతురి విజయం.. తండ్రికి మళ్లీ పోలీస్ జాబ్!

ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ సభ్యురాలైన క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. అంతేకాకుండా 2012లో ఎన్నికల విధుల్లో పొరపాటు వల్ల పోలీస్ ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రి మున్నాసింగ్‌కు తిరిగి కానిస్టేబుల్ జాబ్ ఇస్తామని తెలిపింది. తన తండ్రిని మళ్లీ యూనిఫామ్‌లో చూడటం, ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చేయడమే తన కల అని క్రాంతి పేర్కొన్నారు. ఒకప్పుడు తమకు తిండికి కూడా ఉండేది కాదన్నారు.
News November 9, 2025
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని

AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. ‘గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారు. YCP ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించాం’ అని అనంతపురం జిల్లా పర్యటనలో అన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర కీలకం అని మరో మంత్రి పయ్యావుల చెప్పారు.
News November 9, 2025
‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్‌ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.


