News August 6, 2024
APలో మరిన్ని ఎయిర్పోర్టులు: చంద్రబాబు

APలో నెల్లూరు(D) దగదర్తి, చిత్తూరు(D) కుప్పం, పల్నాడు(D) నాగార్జునసాగర్లలో ఎయిర్పోర్టులు/ఎయిర్స్ట్రిప్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు CM చంద్రబాబు సూచించారు. భూసేకరణ కూడా పూర్తైన ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. తాడిపత్రి, తునిలోనూ ఎయిర్పోర్టులు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని CM కోరారు. కర్నూలు ఎయిర్పోర్టులో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వంటివి తీసుకురావాలన్నారు.
Similar News
News January 19, 2026
వందే భారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇదే..

వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికుల కోసం బెంగాల్, అస్సాం ప్రాంతీయ వంటకాలతో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఇందులో బెంగాలీ స్పెషల్స్ అయిన బాసంతి పులావ్, ఛోలార్ దాల్, మూంగ్ దాల్, ధోకర్ వంటి సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. అస్సామీ రుచుల కోసం సువాసనలు వెదజల్లే జోహా రైస్, మతి మోహర్, మసూర్ దాల్, సీజనల్ వెజిటబుల్ ఫ్రైస్ అందిస్తున్నారు. ఇక తీపి వంటకాల్లో సందేశ్, నారికోల్ బర్ఫీ, రసగుల్లాలను చేర్చారు.
News January 19, 2026
మున్సిపల్ ఎన్నికలు.. మంత్రులకు ఇన్ఛార్జ్ల బాధ్యతలు

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులను లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లుగా CM రేవంత్ నియమించారు. NZB-ఉత్తమ్, మల్కాజిగిరి-కోమటిరెడ్డి, KNR-తుమ్మల, నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్, WGL-పొంగులేటి, చేవెళ్ల-శ్రీధర్ బాబు, KMM-సురేఖ, మహబూబాబాద్-పొన్నం, MBNR-దామోదర, జహీరాబాద్-అజహరుద్దీన్, MDK-వివేక్, నాగర్ కర్నూల్-వాకిటి శ్రీహరి, భువనగిరి-సీతక్క, PDPL-జూపల్లి, ADB-సుదర్శన్ రెడ్డి(ప్రభుత్వ సలహాదారు)
News January 19, 2026
మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

కొందరు తల్లిదండ్రులు మా పిల్లలకు ఏం చెబుతున్నా చెయ్యట్లేదు. మాట వినట్లేదు అని బాధపడుతుంటారు. కానీ పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. మనం తీసుకొనే ఆహారం నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. సానుకూలంగా ఆలోచించడం, క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం పేరెంట్స్ని చూసే నేర్చుకుంటారు. అలాగే వారి మాటలను శ్రద్ధగా వింటేనే తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.


