News September 21, 2024
లాలూ కుటుంబానికి మరిన్ని చిక్కులు

ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు CBI కాపీ సమర్పించింది. ఈ కేసులో CBI ఇప్పటికే లాలూ, అయన కుటుంబ సభ్యుల పాత్రపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి లభించడంతో ఛార్జిషీట్‌ను కోర్టు ఇప్పుడు సమీక్షించి వారిపై అభియోగాలు మోపనుంది.
Similar News
News November 28, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్- 2025 లోగో ఇదే!

భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించిన పురోగతిని సీఎం స్వయంగా తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన లోగోను తాజాగా విడుదల చేశారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఈ సమ్మిట్‌లో ప్రధాన అంశమని అధికారులు తెలిపారు.
News November 28, 2025
గంభీర్‌పై తివారీ ఘాటు వ్యాఖ్యలు

SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో 0-2తో ఓటమి తరువాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆయనను వెంటనే తొలగించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. గంభీర్ తప్పుడు వ్యూహాలు, జట్టులో అతి మార్పులే ఈ పరాజయానికి కారణమని ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు రోహిత్ శర్మ, ద్రవిడ్, కోహ్లీ నిర్మించిన జట్టే కారణమని, గంభీర్ ప్రభావం లేదని తివారీ పేర్కొన్నారు.
News November 28, 2025
బాపట్ల DWCWEOలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ (DWCWEO)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/


