News May 20, 2024

భారత్‌కు మరిన్ని హార్లే డేవిడ్‌సన్ బైక్స్!

image

భారత్‌లో లాంచ్ చేసిన X-440 మోడల్ హిట్ కావడంతో హార్లే డేవిడ్‌సన్ మరిన్ని మోడల్స్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. హీరో మోటార్‌కార్ప్‌తో ప్రస్తుతం ఒక్క మోడల్‌కే పరిమితమైన ఒప్పందాన్ని విస్తరించాలని ఇరు సంస్థలు ప్లాన్ చేస్తున్నాయట. తయారీతో పాటు భారత్‌ నుంచి ఇతర మార్కెట్లకు ఎగుమతులు జరిగేలా ఒప్పందం జరగనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం X-440 బైక్స్‌ రాజస్థాన్‌లోని హీరో ప్లాంట్‌లో తయారు అవుతున్నాయి.

Similar News

News November 28, 2025

గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

image

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.

News November 28, 2025

తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

image

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్‌కు పంపుతారు. ఈ యూనిట్‌లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.

News November 28, 2025

2026 సెలవుల జాబితా విడుదల

image

కేంద్రం 2026 సంవత్సరానికి అధికారిక <>సెలవుల<<>> జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు జనరల్, ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. 14 జనరల్ హాలిడేస్ (రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి, బుద్ధ పూర్ణిమ, క్రిస్మస్, దసరా, దీపావళి, గుడ్ ఫ్రైడే, గురునానక్ జయంతి, ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహా, మహవీర్ జయంతి, మొహర్రం, ఈద్ ఈ మిలాద్), 12 ఆప్షనల్ సెలవులు ఇచ్చింది. ఇవి దేశవ్యాప్తంగా వర్తిస్తాయి.