News December 5, 2024
వ్యవసాయదారులకు మరిన్ని రుణాలు: నాబార్డ్

AP: రాష్ట్రంలో వ్యవసాయానికి మరిన్ని రుణాలు అందించేందుకు తమ సహకారం ఉంటుందని నాబార్డు ఛైర్మన్ షాజీ కృష్ణన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతిలో CM చంద్రబాబుతో కృష్ణన్ సమావేశమయ్యారు. ‘డ్వాక్రా గ్రూపులు, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. రాష్ట్రానికి FIDF కింద అదనపు నిధులు, కేటాయింపులు, రాయితీలు అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
యాడికి: నిద్ర మాత్రలు మింగి యువకుడి సూసైడ్

యాడికి మండలం నగురూరుకు చెందిన శరత్ కుమార్(23) నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నాడు. గత నెలలో శరత్ కుమార్ బళ్లారిలో వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాడు. శుక్రవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
News December 7, 2025
మీ ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటం ఉందా?

పరిగెడుతున్న 7 గుర్రాల చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉత్తర దిశలో ఉంచితే సిరి సంపదలకు లోటుండదని, దక్షిణ దిశలో ఉంచితే చేసే పనుల్లో విజయం లభిస్తుందని అంటున్నారు. ‘ఈ చిత్రం శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తుంది. దీన్ని పూజా మందిరంలోనే పెట్టాల్సిన అవసరం లేదు. సూర్య భగవానుడి వాహనం అయిన రథాన్ని ఈ తెలుపు గుర్రాలే లాగుతాయి’ అని వివరిస్తున్నారు.
News December 7, 2025
అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.


