News October 5, 2024
బొగ్గు కన్నా LNGతోనే ఎక్కువ నష్టం

పర్యావరణ అనుకూల ఇంధనంగా భావించే LNG(లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) గురించి ఓ షాకింగ్ రిపోర్టును కార్నెల్ వర్సిటీ(US) శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వంట, విద్యుత్ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా వినియోగించే దీనివల్ల 20 ఏళ్లలో బొగ్గు కన్నా 33% ఎక్కువగా గ్రీన్హౌస్ వాయువులు విడుదలైనట్లు తెలిపారు. కాగా మీథేన్‌తో తయారయ్యే సహజ వాయువులను LNGగా మార్చడానికి మైనస్ 105 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబర్చాల్సి ఉంటుంది.
Similar News
News October 23, 2025
DMRCలో ఉద్యోగాలు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC)18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఇంటర్, టెన్త్, సీఏ, ICWA ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://delhimetrorail.com/
News October 23, 2025
మన వాళ్లను ఇక్కడికి రప్పిద్దాం.. కేంద్రం ఆలోచన

అమెరికా సహా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పరిశోధకులు, నిపుణులు, ఫ్యాకల్టీని స్వదేశానికి రప్పించాలని కేంద్రం భావిస్తోంది. వారు ఇక్కడి విద్యాసంస్థల్లో బోధించేలా, రీసెర్చ్‌లు చేసేలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. IIT వంటి ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులేస్తోంది.
News October 23, 2025
వరుసగా డకౌట్లు.. కోహ్లీ కెరీర్లో తొలిసారి

లాంగ్ గ్యాప్ తర్వాత వన్డే సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఫెయిల్ అవుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యారు. తన కెరీర్లో ఇలా వరుస ODIల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. దీంతో విరాట్‌కు ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రన్ మెషీన్ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నారు.