News August 7, 2024
నేడు భారత్ ఖాతాలోకి మరిన్ని పతకాలు?

పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం ఖాయమైంది. ఇవాళ రెజ్లింగ్లో వినేశ్ ఫొగట్ ఫైనల్ మ్యాచ్ రాత్రి జరగనుంది. గెలిస్తే స్వర్ణం, ఓడితే సిల్వర్ భారత్ ఖాతాలో చేరనుంది. టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ టీమ్(క్వార్టర్స్), 3000m స్టీపుల్ ఛేజ్, వెయిట్ లిఫ్టింగ్(మీరాబాయి) విభాగాల్లో పతక పోటీలు ఉన్నాయి. మీరాబాయి టోక్యో ఒలింపిక్స్లో రజతం గెలుచుకోగా ఆమెపై అంచనాలు ఉన్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
Similar News
News November 1, 2025
85% మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర

TG: మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఇప్పటివరకూ మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి.
News November 1, 2025
లవ్ స్టోరీ చెప్పేసిన అల్లు శిరీష్

<<18163585>>నిశ్చితార్థం<<>> చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తన లవ్ స్టోరీని ఇన్స్టాలో వెల్లడించారు. 2023లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ సమయంలో నితిన్, శాలిని కందుకూరి ఇచ్చిన పార్టీలో నయనికను కలుసుకున్నట్లు తెలిపారు. అలా ప్రేమ మొదలవ్వగా సరిగ్గా రెండేళ్లకు ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు చెప్పారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే ‘ఇలానే మీ అమ్మను కలిశా’ అని చెబుతా’’ అంటూ రాసుకొచ్చారు.
News November 1, 2025
గర్భవతిని చేసేవారు కావాలంటూ ₹11 లక్షలకు టోకరా

సైబర్ నేరగాళ్లు వేర్వేరు మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘గర్భవతిని చేయగల పురుషుడి కోసం ఎదురుచూస్తున్నాను’ అనే ఆన్లైన్ యాడ్ ఇచ్చి పుణేకు చెందిన కాంట్రాక్టర్ను ₹11Lకు బురిడీకొట్టించారు. ఆయన కాల్ చేయగా ఓ యువతి తన వీడియో పంపింది. ఆపై సైబర్ ముఠా ఫీజుల పేరిట డబ్బు వసూలు చేసింది. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించగా మోసమని తేలింది. ప్రెగ్నెంట్ జాబ్, ప్లేబాయ్ పేరిట ఇది జరుగుతున్నట్లు గుర్తించారు.