News October 17, 2024
‘హైడ్రా’కు మరిన్ని పవర్స్: రంగనాథ్

TG: హైడ్రాకు విశేష అధికారాలు వచ్చాయని, ఇక నుంచి చెరువులతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లను పరిరక్షిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు నోటీసులివ్వడం, వాటిని తొలగించడం, అనధికార భవనాలను సీజ్ చేయడం వంటి అధికారాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు GHMC చట్టంలోని సెక్షన్ 374 (B)ని హైడ్రా అధికారాలుగా చేరుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు.
Similar News
News November 3, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

➢ CM రేవంత్‌తో అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ.. ఈ నెల 14న కొడంగల్‌లోని ఎన్కేపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం.. ఈ కిచెన్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మధ్యాహ్న భోజనం సరఫరా
➢ ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కోసం 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు
➢ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న CCI నిబంధన ఎత్తివేయాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
News November 3, 2025
క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ పెంచిన ICC ఉమెన్ వరల్డ్ కప్

ICC ఉమెన్స్ WC విజయంతో INDIA TEAMలోని క్రీడాకారిణుల బ్రాండ్ వాల్యూ 35% పెరిగింది. దీంతో పర్సనల్ కేర్, బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ రంగాలూ వారి కోసం వెతుకుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే బ్రాండ్ ముద్రపడాలంటే వారు కనీస పరిమితి దాటాలని రెడిఫ్యూజన్ ఛైర్మన్ సందీప్ తెలిపారు. PV సింధును 90% గుర్తించడం లేదని, గిల్ ఫొటోతోపాటు పేరూ పెట్టాల్సి వస్తోందన్నారు.
News November 3, 2025
చేవెళ్ల ప్రమాదం.. డ్రైవర్‌కు యాక్సిడెంట్ రికార్డు లేదు: TGSRTC

TG: చేవెళ్ల సమీపంలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గతంలో ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేనట్టు తేలిందని TGSRTC వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదానికి ఆర్టీసీ బస్సు, డ్రైవర్ కారణం కాదని తెలుస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది. రోడ్డు మలుపు వద్ద అతి వేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పేర్కొంది.


