News January 1, 2025
సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ ఎప్పుడంటే

సంక్రాంతికి తెలంగాణ-ఏపీ మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. ఈ నెల 9, 11న కాచిగూడ-కాకినాడ, 10న హైదరాబాద్(నాంపల్లి)-కాకినాడ మధ్య నడవనున్నట్లు పేర్కొంది. 10, 12 తేదీల్లో కాకినాడ-కాచిగూడ, 11న కాకినాడ-హైదరాబాద్ మధ్య నడవనున్నట్లు తెలిపింది. రేపు ఉదయం 8గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయంది. ఈ రైళ్లు మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి స్టేషన్ల మీదుగా వెళ్తాయి.
Similar News
News November 2, 2025
ముంచెత్తిన వరదలు.. ఆ ఇళ్లకు పరిహారం!

TG: మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు వరంగల్‌ను ముంచెత్తాయి. దీంతో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పూర్తి నష్టం జరిగిన ఇళ్లకు రూ.1.30 లక్షలు, నీట మునిగిన ఇళ్లకు రూ.15వేలు, దెబ్బతిన్న గుడిసెలకు రూ.8వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.6,500 ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నష్టంపై అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.
News November 2, 2025
ఈ దున్న ఖరీదు రూ. 23 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

హరియాణాకు చెందిన అన్మోల్ అనే ఈ దున్న రాజస్థాన్ పుష్కర్ పశువుల సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1,500 Kgల బరువుండే ఈ దున్న ఖరీదు రూ.23 కోట్ల పైనే. దీని వీర్యానికి చాలా డిమాండ్ ఉంది. వారానికి 2సార్లు అన్మోల్ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తారు. ఇలా నెలకు కనీసం రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి ఆహారం కోసం నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది.✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 2, 2025
రాష్ట్రంలో ‘మిట్టల్ స్టీల్’కు పర్యావరణ అనుమతులు!

AP: అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. 14 నెలల రికార్డ్ టైమ్‌లో ఇది సాధ్యమైనట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న CII సదస్సులో దీనికి భూమిపూజ చేయనున్నారు.


