News November 23, 2024
పురుగుల మందు పీల్చి 100కి పైగా కోతుల మృతి
UPలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఆహార నిల్వల గోడౌన్లో పురుగుల మందు స్ప్రే చేయగా కిటికీ నుంచి లోపలికి వెళ్లిన 100కి పైగా కోతులు దాన్ని పీల్చడం వల్ల చనిపోయాయి. గోడౌన్ నిర్వాహకులు గుట్టుగా వాటన్నింటినీ ఓ గోతిలో ఖననం చేశారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కోతుల్ని వెలికి తీశామని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News November 23, 2024
ఈనెల 30న రైతు విజయోత్సవ సభ: భట్టి
TG: ఈనెల 30న మహబూబ్నగర్లో రైతు విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో భారీ కార్నివాల్, లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News November 23, 2024
దీపం-2 స్కీమ్: 50 లక్షలు దాటిన లబ్ధిదారుల సంఖ్య
AP: దీపం-2 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షలకు చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండాలని పేర్కొన్నారు.
News November 23, 2024
విమానాలు లేటైతే ప్యాసింజర్లకు స్నాక్స్, వాటర్!
ఎయిర్లైన్ ప్యాసింజర్ల కోసం DGCA కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు ఆలస్యమైనప్పుడు వారికి ఎయిర్లైన్ సంస్థలు త్రాగు నీరు, ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 2 గంటలు ఆలస్యమైతే వాటర్, 2-4 గంటలు లేట్ అయితే టీ/కాఫీ, స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పొగ మంచు కారణంగా కొన్ని ఫ్లైట్స్ డిలే అవుతున్న సంగతి తెలిసిందే.